Thursday, July 21, 2022
Monday, June 13, 2022
Ramachandra Guha: Hindutva has strong links with fascism – but today’s leaders want to forget them
Italian historian Marzia Casolari rigorously explored how some Indians were influenced by the destructive European ideology.
Jun 05, 2022 · 06:30 am
German Chancellor Adolf Hitler riding in a car with Italian dictator Benito Mussolini in Munich in 1937. | SNEP / AFP
Last month, a teacher of political science in Uttar Pradesh’s Sharda University posed this examination question to his students: “Do you find any similarities between Fascism/ Nazism and Hindu right-wing (Hindutva)? Elaborate with the argument.” The teacher was suspended by the university authorities, on the grounds that the very posing of the question was “totally averse” to the “great national identity” of our country and “may have the potential for fomenting social discord”.
This column seeks to answer the question the teacher in Sharda University was forbidden from asking his students. I use, as my main sources, the writings of the Italian historian, Marzia Casolari, in particular an essay she published in the Economic and Political Weekly in 2000 titled “Hindutva’s Foreign Tie-up in the 1930s”, and a book she published 20 years later, titled In the Shadow of the Swastika: The Relationships Between Indian Radical Nationalism, Italian Fascism and Nazism
Casolari’s work is based on a prodigious amount of research conducted in archives in Italy, India, and the United Kingdom and draws on primary materials in several languages as well. She demonstrates that in the 1920s and 1930s, the Marathi press covered the rise of fascism in Italy with great interest, and mostly admiringly, thinking that a similar ideology in India could likewise transform a backward agrarian country into a rising industrial power and bring order and regimentation to a disputatious society.
Spirit of militarism
These glowing articles on Benito Mussolini and fascism, several of which Casolari quotes, may very well have been read by KB Hedgewar and MS Golwalkar (the pre-eminent leaders of the Rashtriya Swayamsevak Sangh) and by VD Savarkar and BS Moonje (the pre-eminent leaders of the Hindu Mahasabha) – all four of whom had Marathi as their mother tongue. Thus, as Casolari writes, “By the late 1920s, the fascist regime and Mussolini had many supporters in Maharashtra. The aspects of Fascism, which appealed most to the Hindu nationalists, were, of course, the supposed shift of Italian society from chaos to order, and its militarisation. This patently anti-democratic system was considered a positive alternative to democracy, seen as a typical British institution.”
A key figure in Casolari’s researches is Dr BS Moonje, a major ideologue of the Hindu right-wing. Moonje visited Italy in 1931 and met many supporters of the fascist regime. He was deeply impressed by Benito Mussolini and his ideology, and by his seeking to infuse the spirit of militarism among the youth.
At his request, Moonje was granted a meeting with Mussolini himself. When the Duce asked the fawning Indian visitor what he thought about the fascist youth organisations, Moonje replied: “Your Excellency, I am very much impressed. Every aspiring and growing nation needs such organisations. India needs them most for her military regeneration.”
Of his conversation with the fascist dictator of Italy, Moonje remarked: “So ended my memorable interview with Signor Mussolini, one of the great men of the European world. He is a tall man with broad face and double chin and broad chest. His face shows him to be a man of strong will and powerful personality. I have noted that Italians love him.”
Moonje was awed by Mussolini’s personality and swept away by his ideology, with its glorification of perpetual war and its contempt for peace and reconciliation. He quoted with approval statements of the Italian dictator such as this one: “War alone brings up to its highest tension all human energy and puts the stamp of nobility upon the peoples who have the courage to meet it.”
And this one too: “Fascism believes neither in the possibility nor the utility of perpetual peace. It thus repudiates the doctrine of Pacifism which is born of renunciation of the struggle and [is] an act of cowardice in the face of sacrifice.”
Moonje was a mentor to the future founder of the RSS, KB Hedgewar. As a young student in Nagpur, Hedgewar stayed in Moonje’s house, and it was Moonje who sent Hedgewar to study medicine in Calcutta. After his trip to Italy, Moonje and Hedgewar worked hard to bring the Hindu Mahasabha and the RSS into closer collaboration. Casolari informs us that in January 1934, Hedgewar chaired a conference on fascism and Mussolini, with Moonje making one of the main speeches.
Standardisation of Hinduism
In March of the same year, Moonje, Hedgewar and their colleagues had a long meeting where Moonje remarked: “I have thought out a scheme based on Hindu Dharm Shastra which provides for standardisation of Hinduism throughout India… But the point is that this ideal cannot be brought to effect unless we have our own swaraj with a Hindu as a dictator like Shivaji of old or Mussolini or Hitler of the present day in Italy or Germany. But this does not mean that we have to sit with folded hands until some such dictator arises in India. We should formulate a scientific scheme and carry on propaganda for it.”
Moonje drew a direct parallel between Italian fascism and the ideology of the RSS. Thus he wrote: “The idea of Fascism vividly brings out the conception of unity amongst peoples. India and particularly Hindu India need some such Institution for the military regeneration of the Hindus… Our Institution of Rashtriya Svayamsewak Sangh of Nagpur under Dr Hedgewar is of this kind, though quite independently conceived.”
Casolari observes that “the RSS method of recruitment was practically identical to that of the Balilla youth organisation in Italy. Shaka members, for instance, were grouped according to their age (6-7 to 10; 10 to 14; 14 to 28; 28 and older). This is amazingly similar to the age bands of the hierarchical organisation of the fascist youth organisations… The hierarchical ordering of RSS members, however, came after the organisation was founded and may well have been derived from Fascism.”
Casolari quotes a police officer’s note of 1933, which says of the RSS: “It is perhaps no exaggeration to assert that the Sangh hopes to be in future India what the ‘Fascisti’ are to Italy and the ‘Nazis’ to Germany.” The note further observes: “The Sangh is essentially an anti-Muslim organisation aiming at exclusively Hindu supremacy in the country.”
Casolari’s research also has some interesting insights into the worldview of Savarkar. She writes that “[in] about 1938, Nazi Germany became the main point of reference for the Hindu Mahasabha, under Savarkar’s presidency. Germany’s rabid policies regarding race were taken as the model to be adopted to solve the ‘Muslim problem’ in India.”
Among the remarks by Savarkar quoted by Casolari are these:
“Germany has every right to resort to Nazism and Italy to Fascism and events have justified that those isms and forms of Government were imperative and beneficial to them under the conditions that obtained there.”
“Nationality did not depend so much on a common geographical area as on unity of thought, religion, language and culture. For this reason the Germans and the Jews could not be regarded as a nation.”
“In Germany the movement of the Germans is the national movement but that of the Jews is a communal one.”
“A Nation is formed by a majority living therein. What did the Jews do in Germany? They being in minority were driven out of Germany.”
“[T]he Indian Muslims are on the whole more inclined to identify themselves and their interests with Muslims outside India than Hindus who live next door, like Jews in Germany.”
Savarkar is, of course, an iconic figure for the Hindutva regime in power in India today. Casolari’s book also contains a passing reference to another Hindutva icon, Syama Prasad Mookerjee. In the inter-war period, the Italian government sought energetically to cultivate Indian intellectuals and politicians who might be sympathetic to fascism.
Their work was furthered by Giuseppe Tucci, the most eminent Italian Orientalist of his generation and a supporter of fascism himself. Tucci corresponded regularly with Moonje and, in the 1930s, was also in contact with SP Mookerjee, the then vice-chancellor of Calcutta University, and in the fullness of time to become the founder of the Jana Sangh, the predecessor of the Bharatiya Janata Party. Writing to his mentor, the fascist philosopher, Giovanni Gentile, Tucci described Mookerjee as “our most important collaborator” in Calcutta.
Marzia Casolari is not the first scholar to explore the parallels between Hindutva and fascism. However, she has done so with more rigour and in greater detail than anyone else. Her research demonstrates that the teacher in Sharda University had asked his students a legitimate and important question. By not allowing them to answer it, and by suspending the teacher himself, the university administrators have demonstrated their fear of the truth. And perhaps, even more, fear of their political bosses, who would wish us to forget that the founders of Hindutva were greatly inspired by European fascism.
Ramachandra Guha’s new book, Rebels Against the Raj, is now in stores. His email address is ramachandraguha@yahoo.in.
This article first appeared in The Telegraph.
Source: scrollin
Saturday, June 11, 2022
Friday, June 10, 2022
జ్ఞాన్వాపి మసీదు: ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
- వినీత్ ఖరే
- బీబీసీ ప్రతినిధి
21 మే 2022
ఫొటో సోర్స్, Robert Nickelsberg/Getty Images
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ్ మందిరం పక్కనుండే జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడిందని వార్తలు వచ్చాయి.
తాజ్‌మహల్‌ను తేజో మహాలయ మందిరంగా చెబుతూ అక్కడ మూసి ఉన్న 22 గదుల్లో ఏముందో వెల్లడించాలని డిమాండ్లు వస్తున్నాయి.
మరోవైపు కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని కువ్వాతుల్ ఇస్లాం మసీదు కూడా హిందువుల ప్రార్థన స్థలమని చెబుతున్నారు.
శ్రీకృష్ణ జన్మభూమి కేసుపై విచారణ చేపట్టేందుకు మథుర జిల్లా కోర్టు అంగీకారం తెలిపింది.
దిల్లీ జామా మసీదు కింద హిందూ దేవతల విగ్రహాలున్నాయని కూడా హిందూ మహాసభ చెబుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
ఎందుకిలా?
అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని సుప్రీం కోర్టు సూచించిన తర్వాత, 2019 నవంబరు 9న ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘‘ఈ నిర్ణయం తర్వాత, ‘‘నవ భారత్’’ను నిర్మించేందు మనం సంకల్పించాలి. రండి అంతా కలిసి కొత్తగా మొదలుపెడదాం’’అని మోదీ పిలుపునిచ్చారు.
ఆ నిర్ణయానికి నేటితో మూడేళ్లు. అయితే, ఇప్పుడు ‘‘ఆ మసీదు ఒకప్పుడు మందిరం’’అనే చర్చ నడుస్తోంది. ఒక్కసారిగా కోర్టుల దగ్గరకు పిటిషన్లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ‘‘5,000ఏళ్లనాటి నాగరికతతో ప్రజలు ఆడుకుంటున్నారు’’అని రిరెలిజియస్ నేషనలిజంపై పరిశోధన చేస్తున్న షామ్సుల్ ఇస్లాం చెప్పారు.
ఒకవైపు యుక్రెయిన్-రష్యా యుద్ధం నడుస్తోంది. మరోవైపు కరోనావైరస్తో 62 లక్షల మంది మరణించారు. 2019లో ఒక్క వాయు కాలుష్యం వల్లే 17 లక్షల మంది భారత్‌లో మరణించారు. వాయు కాలుష్య మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.
నేడు భారత్‌ను తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యలు వెంటాడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సమస్యలు కూడా వచ్చిపడుతున్నాయి. కానీ, హిందూ-ముస్లింల ఘర్షణలు, ఎవరు ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు? 400, 500, 600 లేదా వెయ్యి ఏళ్ల క్రితం ఏం జరిగింది? లాంటి అంశాల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి.
మే 12న బీజేపీ అధికార ప్రతినిధి అనిలా సింగ్ ఒక ట్వీట్ చేశారు. ‘‘ఇది సమాధి, ప్యాలస్‌గా ఎలా మారింది తమ్ముడు?’’అని ఆమె ప్రశ్నించారు. తాజ్‌మహల్ ఫోటోను కూడా ఆమె ట్వీట్ చేశారు.
‘‘ప్రాథమిక హక్కులు కేవలం మైనారిటీలకేనా? మెజారిటీలు దీని గురించి మాట్లాడితే, మతపరమైన హింసను రెచ్చగొట్టినట్లా?’’అని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు జ్ఞాన్వాపి మసీదులో శివలింగం బయటపడిందనే విషయాన్ని చెబుతూ #GyanvapiTruthNow హ్యాష్‌ట్యాగ్‌తో ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక ట్వీట్ చేశారు. ‘‘నిజాన్ని ఎంతకాలం దాస్తారు? ఏదో ఒకరోజు అది బయటకు వస్తుంది. ఎందుకంటే నిజం అంటే శివుడే’’అని ఆయన ట్వీట్ చేశారు.
ఫొటో సోర్స్, FACEBOOK
ఫొటో క్యాప్షన్,
ప్రతాప్ భాను మెహతా
జ్ఞాన్వాపితో చర్చ
ప్రస్తుతం కాశీలోని జ్ఞాన్వాపి మసీదు చుట్టూ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఇది మసీదు అని చెబుతున్నారు.
బ్రిటిష్ లైబ్రరీలో విశ్వనాథ్ దేవాలయం ఫోటోతోపాటు దీనిపై వివరాలు కూడా ఇచ్చారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ దేవాలయాన్ని ఇందౌర్‌కు చెందిన అహిల్యా బాయి హోల్కర్ పునర్నిర్మించారు.
‘‘కాశీ, మథుర దేవాలయాలను ఔరంగజేబు ధ్వంసం చేయించారు. ఆయన ఆదేశాలపైనే ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేశారు. అయితే, ఆయన ఒకవైపు దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ, మరోవైపు చాలా ఆలయాలకు ఆయన నిధులు మంజూరు చేశారు. ఆయన భారీగా విరాళాలు ఇచ్చారు’’అని చరిత్రకారుడు హర్బంశ్ ముఖియా చెప్పారు.
అయితే, చరిత్రలో సంక్లిష్టతను నేడు వివరించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో చరిత్రలో ఇలా జరిగింది.. ఇప్పుడు ఇలా చేయాలి.. అని చెప్పడం ఎంతవరకు సమంజసం? దీని వల్ల ఏం వస్తుంది?
ఫొటో సోర్స్, Getty Images
చరిత్రను తవ్వుకుంటే..
‘‘చరిత్రను తవ్వుకోవడం ద్వారా మనం ఏం సాధిస్తాం అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి’’అని రచయిత, ప్రొఫెసర్ పురుషోత్తం అగర్వాల్ వ్యాఖ్యానించారు.
‘‘చరిత్ర ఎప్పుడూ అంత అందమైనది కాదు. కానీ, ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశం ఇలా చరిత్రను తవ్వుకునేందుకు తన శక్తిని ధారపోయకూడదు’’అని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సంపాదకీయాన్ని ప్రచురించింది.
‘‘ఇప్పటికే భారత్‌లో చాలా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆ మసీదు ఇదివరకు దేవాలయం అనే చర్చతో పరిస్థితులు మరింత దిగజారుతాయి’’అని ఆ కథనంలో వ్యాఖ్యానించారు.
జ్ఞాన్వాపీ మసీదు వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లినప్పుడు కూడా ‘‘దిగువ న్యాయస్థానాలకు అర్థమయ్యేరీతిలో సుప్రీం కోర్టు చెప్పాలి. ఇలాంటి కేసులు విచారణ చేపట్టాలని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్‌ను అనుసరించాలని సూచించాలి. చట్టప్రకారం నడుచుకోకపోతే, సహించబోమని స్పష్టం చేయాలి’’అని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ కథనం ప్రచురించారు.
ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం.. 1947 ఆగస్టు 15 సమయంలో ఆయా ప్రార్థనా స్థలాల్లో ఏయే మతాలను అనుసరిస్తున్నారో ఆ తర్వాత కూడా ఆ మతాలనే అనుసరించాలి.
‘‘అయోధ్య తీర్పు తర్వాత, కాశీ, మథుర దేవాలయాలపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే మెజారిటీల చేతిలో ఇప్పుడు అధికారం ఉంది’’అని చరిత్రకారుడు ప్రతాప్ భాను మెహ్తా వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, RSTV
ఫొటో క్యాప్షన్,
డీఎన్ ఝా
‘‘ఆ ప్రార్థనా స్థలాలను వెనక్కి తీసుకోవడం మతపరంగా మంచి పనికాదు. మన భక్తి భావం కాశీ విశ్వనాథ్ ఆలయం లేదా మథుర లోని దేవాలయంపైనే ఉండాలి. ఇక్కడ మసీదులను తొలగించాలని అనుకుంటే, హిందువుల చేతిలో అధికారం ఉంది కాబట్టే, వారు ఇలా చేస్తున్నారని మైనారిటీలు భావిస్తారు’’అని ఆయన రాసుకొచ్చారు.
‘‘రీక్లైమ్ టెంపుల్స్’’ పేరుతో రచయిత విమల్ వీ ఒక పుస్తకం రాశారు. ‘‘ముస్లింలు లక్షల కొద్దీ హిందూ దేవాలయాలను కూలదోశారు. సైద్ధాంతికంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వారు అలా చేశారు’’అని ఆయన చెప్పారు.
‘‘అలా ఆక్రమించిన ప్రార్థనా స్థలాలను మళ్లీ వెనక్కి తెచ్చుకోవాలి’’అని విమల్ అన్నారు. దీని కోసం రీక్లైమ్ టెంపుల్ పేరుతో తాము ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని, దీనితో ఏ రాజకీయ పార్టీకి సంబంధంలేదని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఇలాంటి సంస్థలు చాలానే మనకు కనిపిస్తాయి.
మరోవైపు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కూడా మొఘల్ పాలకులు 36,000 హిందూ దేవాలయాలను కూలదోశారని చెప్పారు. ఆ ప్రార్థనా స్థలాలను వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.
కొన్ని హిందూ సంస్థలు అయితే, ముస్లిం పాలకులు 60,000కుపైగా దేవాలయాలను ధ్వంసం చేశారని చెబుతున్నాయి. అయితే, చరిత్రకారులు డీఎన్ ఝా, రిచర్డ్ ఏటన్ల సమాచారం ప్రకారం కేవలం 80 హిందూ దేవాలయాలను మాత్రమే ధ్వంసం చేశారు.
‘‘మొత్తంగా 300 దేవాలయాలను ధ్వంసం చేశారని 60ల్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు మూడేళ్లకే ఇవి 300 నుంచి 3,000కు పెరిగాయి’’అని హర్బంశ్ చెప్పారు.
హిందువులు చేసినప్పుడు?
భారత్‌లోని దేవాలయాలను కేవలం హిందూయేతర పాలకులు మాత్రమే ధ్వంసం చేశారని భావించకూడదు.
‘‘మొఘల్ పాలనకు ముందు కూడా రాజుల మధ్య వైరాల వల్ల దేవాలయాలు ధ్వంసమయ్యాయి’’అని చరిత్రకారుడు రిచర్డ్ ఏటన్ రాసుకొచ్చారు.
‘‘642లో పల్లవ రాజు నరసింహ వర్మన్.. చాలుక్యుల రాజధాని వాతాపిలో గణేషుడి విగ్రహాన్ని దోచుకెళ్లారు’’అని ఏటన్ వివరించారు.
‘‘ఎనిమిదవ శతాబ్దంలో రాజు లలితాదిత్యాపై బెంగాలీ సైన్యం దండెత్తింది. కశ్మీర్‌లోని రాజాదేవ్ విష్ణు వైకుంఠ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలే దీనికి కారణం’’అని ఏటన్ పేర్కొన్నారు.
హిందువులు కూడా దేవాలయాలను దోచుకెళ్లారని, దేవాలయాల్లోని విగ్రహాలను కూడా తీసుకెళ్లిపోయేవారని చరిత్రకారుడు హర్బంశ్ ముఖియా కూడా చెప్పారు.
‘‘కశ్మీర్ రాజు హర్ష అయితే, దేవాలయాల్లోని విగ్రహాలను దోపిడీచేసేందుకు ఒక అధికారిని కూడా నియమించారు’’అని ఆయన చెప్పారు.
‘‘9వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు గోవింద్-3 కాంచీపురంపై దాడి చేశాడు. దీంతో బెంబెలెత్తిన శ్రీలంక రాజు సింహళ దేశాన్ని ప్రతిబింబించే విగ్రహాలు (బహుశా బుద్ధుడి విగ్రహాలు)ను పంపించాడు. ఈ విగ్రహాలను తన రాజధానిలోని శివుడి ఆలయంలో రాజు గోవింద్ ఏర్పాటుచేశాడు’’అని ఏటన్ రాసుకొచ్చారు.
వీడియో క్యాప్షన్,
కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
‘‘అదే సమయంలో పాండ్యుల రాజు శ్రీమర శ్రీవల్లభ్ శ్రీలంకపై దాడి చేశాడు. అక్కడి నుంచి బంగారంతోచేసిన బుద్ధుడి విగ్రహాన్ని దోచుకున్నాడు’’అని ఏటన్ పేర్కొన్నారు.
‘‘11వ శతాబ్దంలో చోల రాజు రాజేంద్ర-1 తన రాజధానిని భిన్న ప్రాంతాల నుంచి దోచుకొచ్చిన విగ్రహాలతో అలంకరించాడు. చాలుక్య రాజ్యం నుంచి దోచుకొచ్చిన దుర్గ, గణేషుడి విగ్రహాలు కూడా దీనిలో ఉన్నాయి. మరోవైపు కళింగ నుంచి భైరవ్, భైరవి, కాళీ, తూర్పు చాలుక్యుల నుంచి నంది విగ్రహాలను కూడా ఆయన దోచుకున్నాడు’’అని ఏటన్ రాసుకొచ్చారు.
‘‘1460ల్లో ఒడిశాలోని సూర్యవంశ గణపతి రాజ్య స్థాపకుడు కపిలేంద్ర.. శివ, విష్ణు దేవాలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. చాలా ఘటనల్లో రాజులు కట్టించిన ఆలయాల్లోని విగ్రహాలను దండెత్తినవారు దోచుకెళ్లేవారు. ఇక్కడ హిందూ రాజులు కూడా ఈ దాడులు చేసేవారని గుర్తుపెట్టుకోవాలి’’అని ఏటన్ వివరించారు.
‘‘దేవాలయాలపై జరిగే దాడులను అప్పట్లో అధికార కేంద్రాలపై జరిగే దాడులుగా పరిగణించేవారు. ఎందుకంటే దేవాలయాలే అధికారాలకు కేంద్రంగా చెప్పేవారు’’అని హర్బంశ్ వివరించారు.
‘‘దేవాలయాలను కూడా కాపాడలేని వ్యక్తి రాజు ఎలా అవుతాడనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేవి. మరోవైపు దేవాలయాల్లోని వజ్రాలు, బంగారం కూడా దాడులకు కారణం’’అని ఆయన చెప్పారు.
‘‘అయితే, ఎన్ని దేవాలయాలను ధ్వంసం చేశారో కచ్చితంగా చెప్పడం కష్టమే. కానీ, 12 నుంచి 18వ శతాబ్దాల మధ్య దాదాపు 80 హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి’’అని ఆయన ఏటన్ చెప్పారు. అయితే, కొంతమంది హిందూ జాతీయవాదులు 60,000కుపైగా ఆలయాలను ధ్వంసం చేశారని చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
బౌద్ధ ఆరామాలను కూడా..
‘‘ఎగెనెస్ట్ ద గ్రైన్ – నోట్స్ ఆన్ ఐడెంటిటీ, ఇన్టోలెరెన్స్, హిస్టరీ’’ పేరుతో చరిత్రకారుడు డీఎన్ ఝా ఒక పుస్తకం రాశారు. దీనిలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, ప్రార్థనా స్థలాలను బ్రాహ్మణ రాజులు దోచుకెళ్లడం గురించి ఆయన ప్రస్తావించారు. అయితే, ఈయన పుస్తకంతో చాలా మంది చరిత్రకారులు విభేదిస్తున్నారు.
‘‘పురాతన కాలంలో హిందువుల్లో కుల వ్యవస్థ, పెద్దపెద్ద యజ్ఞాల వల్ల చాలా మంది బౌద్ధంవైపు ఆకర్షితులయ్యారు. అయితే, దీన్ని కొందరు హిందూ రాజులు తమకు ముప్పుగా భావించేవారు. దీంతో బౌద్ధ ప్రార్థన స్థలాలపై దాడులు జరిగేవి’’అని ఝా తన పుస్తకంలో పేర్కొన్నారు.
‘‘ఆ తర్వాత బౌద్ధులు కూడా తమను తాము కాపాడుకునేందుకు బుద్ధుడు.. విష్ణువు అవతారమేనని చెప్పుకొచ్చారు’’అని ఝా వివరించారు.
‘‘అశోకుడు బౌద్ధ మతాన్ని అనుసరిస్తే, అతడి కుమారుడు శివుడిని పూజించేవాడు. అతడు బౌద్ధ విహారాలను కూడా ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది’’అని ఝా పేర్కొన్నారు.
‘‘బౌద్ధులను హింసకు గురిచేసిన వారిలో పుష్యమిత్ర సుంగ ఒకరు. ఆయన చాలా బౌద్ధ స్తూపాలు, బౌద్ధ ఆరామాలను తగులబెట్టించారు. శిలాకోట్లోని పెద్ద సంఖ్యలో బౌద్ధులను ఆయన చంపించారు’’అని ఝా వివరించారు.
వీడియో క్యాప్షన్,
వారణాసి: మందిరం, మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?
‘‘పట్నాలోని బౌద్ధ విహారాలను కూడా పుష్యమిత్ర సుంగానే ధ్వంసం చేయించి ఉండొచ్చు’’అని ఝా రాసుకొచ్చారు.
మరోవైపు చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ చెప్పిన సంగతులను ఉటంకిస్తూ ‘‘శివుడి భక్తుడైన రాజు మిహిర్కుల్ 1,600 బౌద్ధ స్తూపాలను, విహారాలను ధ్వంసం చేశారు. వేల మంది బౌద్ధులను హత్య చేశారు’’అని ఝా పేర్కొన్నారు.
‘‘ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీలను కూడా హిందూ అతివాదులు తగలబెట్టారు. కానీ, దీన్ని బఖ్తియార్ ఖిల్జీ తగ్గులబెట్టారని చెబుతారు. అసలు ఆయన అక్కడికి వెళ్లనేలేదు’’అని ఝా వివరించారు.
‘‘పూర్ణేశ్వర్, కేదారేశ్వర్, కాంతేశ్వర్, సోమేశ్వర్, అగ్నేశ్వర్ ఆలయాలను బౌద్ధారామాలను ధ్వంసం చేసి కట్టారని చెప్పడంలో ఎలాంటి సందేహమూలేదు’’అని ఝా వివరించారు.
అయితే, ఝా వాదనలు చాలా పక్షపాతంతో సందేహాలను రేకెత్తించేలా ఉన్నాయని దిల్లీ యూనివర్సిటీలోని బౌద్ధ అధ్యయన కేంద్రం మాజీ ప్రొఫెసర్ కేటీఆఎస్ సరావో చెప్పారు.
‘‘బ్రాహ్మణులు, బౌద్ధుల మధ్య విభేదాలున్న మాట వాస్తవమే. కానీ, రెండు వర్గాల మధ్య హింస చెలరేగిందని చెప్పడం సరికాదు. వేల మందిని హత్య చేశారని అంటున్నారు. కానీ, అలా జరిగి ఉండకపోవచ్చు’’అని ఆయన అన్నారు.
‘‘ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా’’ పేరుతో ప్రొఫెసర్ సరావో ఒక పుస్తకం రాశారు. ‘‘హింస జరిగి ఉండొచ్చు.. అయితే, అది స్థానికంగా లేదా చాలా స్వల్పంగా ఘర్షణలు ఉండేవి. భారీగా అయితే, లేవు’’అని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు.
వీడియో క్యాప్షన్,
కాశీ-జ్ఞాన్వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?
నలంద వర్సిటీని బఖ్తియార్ ఖిల్జీనే ధ్వంసం చేయించాడని సరావో చెప్పారు. ‘‘అక్కడ బ్రాహ్మణ రాజులు అరాచకాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’’అని ఆయన వివరించారు.
అయితే, తమ మతానికి చెందనివారిపై హింసకు పాల్పడటం ఒక్క భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. బౌద్ధంలో అహింసకి ప్రధాన పాత్ర ఉంటుంది. కానీ, శ్రీలంక, మియన్మార్లలో ఇతర మతాలకు చెందిన వారిపై అరాచకాలకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
పొరుగున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులూ భిన్నంగా ఏమీలేవు. ఇస్తాంబుల్‌లో ఒకప్పటి చర్చి హయా సోఫియాను ప్రస్తుతం మసీదుగా మార్చేశారు. యూరప్‌లోనూ మతం పేరుతో యుద్ధాలు జరిగాయి.
కానీ నేడు భారత్‌లో సంక్లిష్టమైన చరిత్రను టీవీ చర్చల్లో తమకు అనుగుణంగా మలచుకుంటున్నారని హరివంశ్ ముఖియా చెప్పారు. ‘‘పాపులర్ హిస్టరీ చాలా తేలిక.. ప్రొఫెషనల్ హిస్టరీ చాలా కష్టం. కానీ, ప్రొఫెషనల్ హిస్టరీ పుస్తకాన్ని కేవలం 1,000 మంది మాత్రమే చదువుతారు. కానీ, టీవీ ఛానెళ్లను పది లక్షల మంది చూస్తారు. వెయ్యి మంది కోసం రాయడం చాలా కష్టం. కానీ, పది లక్షల మందిని చేరుకోవడం చాలా తేలిక’’అని ఆయన వ్యాఖ్యానించారు.
Source: BBC NEWS I తెలుగు