Showing posts with label Modesty. Show all posts
Showing posts with label Modesty. Show all posts

Friday, July 10, 2015

ఎదిగినా ఒదిగుండే వ్యక్తిత్వం ఆమె సొంతం

ఆంధ్రజ్యోతి 

గన్నవరం: భారత జట్టుకు ఆడి వచ్చిన ఏ క్రికెటర్‌కైనా ఎయిర్‌పోర్ట్‌లో కారు, స్వాగతం పలికేందుకు హంగా మా ఉంటుంది. కానీ టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌, విజయవాడ క్రీడాకారిణి కల్పన పరిస్థితి మాత్రం వేరు. బెంగళూరులో ఐదు వన్డేల సిరీస్‌లో పాల్గొని గురువారం తిరిగొచ్చిన కల్పనకు స్వాగతం పలికేందుకు ఆమె తండ్రి, ఆటో డ్రైవర్‌ వెంకటేశ్వరరావు, ఆమె చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, విద్యార్థులు మా త్రమే వచ్చారు. అనంతరం తన తం డ్రి నడిపే ట్రాలీ ఆటో లో ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి బయలుదేరింది.